ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పాకిస్తాన్ క్రికెట్‌ను కుదిపేస్తోంది. ఈ ఓటమిని ఆ దేశ అభిమానులు, ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈ ఓటమికి కెప్టెన్ బాబర్ ఆజంను బాధ్యుడిని చేస్తూ అతన్ని కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని కొందరు సూచిస్తుంటే.. మరికొందరు అతన్ని మానసికంగా వేధించటం మొదలుపెట్టారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంక్‌లో ఉన్న బాబర్ ఆజం ఈ టోర్నీలో పెద్దగా రాణించడం లేదు. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. అవి నెం.1 ర్యాంక్‌కు తగ్గ ప్రదర్శన కాదన్నని అభిమానుల వాదన. 5, 10, 50, 18, 74.. ఇవి గత ఐదు మ్యాచ్‌ల్లో అతడు చేసిన పరుగులు. జింబాబ్వేపై పోటీపడి శతకాలు బాదే అతడు.. ఈ టోర్నీలో కనీసం ఒక సెంచరీ కూడా ఎందుకు చేయలేకపోతన్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు అతన్ని జిమ్‌బాబర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు అతని వికీపీడియా పేజీలో మార్పులు చేశారు.
పాక్ కెప్టెన్ వికీపీడియాలో బాబర్ ఆజం అలియాస్ జిమ్‌బాబర్ అని జోడించారు. అలాగే అతని నిక్ నేమ్ స్థానంలో బాబీతో పాటుగా జిమ్‌బాబర్ అని మార్పులు చేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అతని వికీపీడియా పేజీని మళ్లీ సాధారణ స్థితిలో పునరుద్ధరించారు.
Some of the cricket fans have edited Babar Azam's Wikipedia page and added "also known as Zimbabar". #CricketTwitter pic.twitter.com/ouicfI8ju5
— Himanshu Pareek (@Sports_Himanshu) October 26, 2023
Fan(s) edited Babar Azam’s name on Wikipedia to “ZIMBabar “#PAKvsSA #ENGvsSL #CricketWorldCup2023 #BabarAzam pic.twitter.com/NzRRrPZoXE
— Hammer and Gavel (@hammer_gavel) October 26, 2023
పాక్ సెమీస్ అవకాశాలు
ప్రస్తుత గణాంకాల ప్రకారం చేస్తే.. పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువ. అలా అని పూర్తిగా కొట్టి పారేయలేం. ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. వీటన్నిటిలో విజయం సాధిస్తే.. మొత్తం 6 విజయాలతో(12 పాయింట్లు)తో టాప్- 4లో చోటు దక్కించుకోవచ్చు. కాకపోతే అది కూడా ఇతర జట్ల విజయావకాశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
పాకిస్తాన్ తదుపరి నాలుగు మ్యాచ్‌లు
- అక్టోబర్ 27న దక్షణాఫ్రికాతో(చెన్నై),
- అక్టోబర్ 31న బంగ్లాదేశ్‌తో(కోల్‌కతా),
- నవంబర్ 4న న్యూజిల్యాండ్‌తో(బెంగళూరు),
- నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో(కోల్‌కతా)..
పాకిస్తాన్ తదుపరి నాలుగు మ్యాచ్ లను పరిశీలిస్తే.. ఇందులో ఒక్క బంగ్లాదేశ్ పై మాత్రమే గెలవగలదని ధైర్యంగా చెప్పగలం. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే దక్షణాఫ్రికా, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్ పై గెలవటం అసాధ్యం. మరి ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ సెమీస్ చేరేది.. లేనిది కాలమే నిర్ణయించాలి.
ALSO READ :- అక్టోబర్ లాస్ట్ వీక్.. OTTలో వచ్చే సినిమాలు ఇవే..ఆస్కార్ రేసులోని మూవీ కూడా!