ODI World Cup 2023: అధ్యక్షుడిగా బైడెన్ తప్పుకుంటే.. మా జట్టు సెమీస్ చేరుతుంది: పాక్ పౌరుడు

ODI World Cup 2023: అధ్యక్షుడిగా బైడెన్ తప్పుకుంటే.. మా జట్టు సెమీస్ చేరుతుంది: పాక్ పౌరుడు

పాకిస్తాన్‌పై విజయంతో ఆప్ఘన్‌లో సంబరాలు మిన్నంటుతుంటే.. దాయాది పాకిస్తాన్‌లో మాత్రం అంధకారం నెలకొంది. ఈ ఓటమిని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. భారత గడ్డపై ప్రపంచ కప్ తమదే అంటూ అని ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడెలా మొహం చూపించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదిలావుంటే, ఓ యూజర్ పాక్ సెమీస్ చేరే సమీకరణాలపై నెట్టింట పోస్ట్ పెట్టాడు.

ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడింట ఓటమపాలైంది. ఉప్పల్ వేదికగా టోర్నీ తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై విజయం సాధించిన పాక్.. అనంతరం అదే గడ్డపై శ్రీలంకను చిత్తుచేసింది. అదే వారి చివరి విజయం. ఆ తరువాత హ్యాట్రిక్ ఓటములు ఎదురయ్యాయి. మొదట భారత్ చేతిలో మట్టికరిచిన దాయాది జట్టు.. ఆపై ఆస్టేలియా, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమపాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడాల్సివుండగా, అన్నింటా విజయం సాధిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది.

అయితే, ఐదింట మూడు ఓటములు ఎదుర్కొన్న పాక్.. మిలిగిన నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తుంటే ఆ దేశ అభిమానులకు నమ్మకం కలగడం లేదు. ఈ క్రమంలో ఓ ఎక్స్(ట్విట్టర్) యూజర్ ఆ జట్టు సమీకరణాలపై ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అందులో అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్ తప్పుకుంటే.. వారి జట్టు సెమీస్ చేరుతుందన్న ఆప్షన్ కూడా ఒకటుంది.

పాక్ సెమీస్ కు అర్హత సాధించాలంటే.. 

  • పాకిస్తాన్ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి
  • బంగ్లాదేశ్‌.. దక్షిణాఫ్రికాను ఓడించాలి
  • భారత్‌.. నెదర్లాండ్స్‌ను ఓడించాలి
  • ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వాలి
  • న్యూజిలాండ్ జట్టు ఫ్లైట్‌ మిస్సవ్వాలి
  • శ్రీలంక ఆటగాళ్ళు తమ ప్రయాణంలో పాస్‌పోర్ట్‌ మరచిపోవాలి 
  • ఇంగ్లండ్ జట్టు వెళ్లాల్సిన స్టేడియానికి బదులుగా తప్పు స్టేడియానికి వెళ్ళాలి
  • మైఖేల్ షూమేకర్ కోమా నుండి బయటపడాలి 
  • రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలి
  • లూయిస్ హామిల్టన్ F1 టైటిల్ గెలవాలి 
  • లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్‌ విశ్వవిజేతగా అవతరించాలి 
  • మాంచెస్టర్ యునైటెడ్ ఛాంపియన్స్ లీగ్‌ టైటిల్ సొంతం చేసుకోవాలి
  • జో బిడెన్ ను అమెరిగా అధ్యక్ష పదవి నుండి తొలగించాలి

పైవన్నీ జరిగితే పాకిస్తాన్ జట్టు 2023 వన్డే ప్రపంచ కప్ లో సెమీస్ చేరుతుందట. ఓ పాక్ పౌరుడు పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. మీ జట్టుపై మీకు నమ్మకం అని భారత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.