1992 ఛాంపియన్.. 1999 రన్నరప్.. 1975 మినహా వరుసగా మూడు సార్లు సెమీస్ చేరిన జట్టు. ఇలాంటి ప్రదర్శన ఉన్న జట్టు నుంచి కనీసపోటీని ఏ అభిమాని అయినా ఆశిస్తాడు. అందుకు తగ్గట్టే పాకిస్తాన్ జట్టు మరోసారి వన్డే ప్రపంచ కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ, టోర్నీ ప్రారంభమైన పక్షం రోజుల్లోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన పాక్.. సెమీస్ చేరుతుందని గట్టిగా చెప్పలేని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలెంతో చూద్దాం..
కలిసొచ్చిన తెలుగు గడ్డ
ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు కలిసొచ్చింది అంటే.. హైదరాబాదే. ఉప్పల్ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‍ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్‍పై విజయం సాధించిన పాక్.. అనంతరం అదే గడ్డపై శ్రీలంకను చిత్తుచేసింది. అదే వారికి చివరి విజయం. ఆ తరువాత పాక్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. అహ్మదాబాద్ గడ్డపై భారత్ చేతిలో మట్టికరిచిన దాయాది జట్టు.. ఆపై బెంగళూరు వేదికగా ఆస్టేలియా చేతిలో, చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది.
సెమీస్ చేరే అవకాశమెంత?
ప్రస్తుత గణాంకాల ప్రకారం చేస్తే.. పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువ. అలా అని పూర్తిగా కొట్టి పారేయలేం. ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. వీటన్నిటిలో విజయం సాధిస్తే.. మొత్తం 6 విజయాలతో(12 పాయింట్లు)తో టాప్- 4లో చోటు దక్కించుకోవచ్చు. కాకపోతే అది కూడా ఇతర జట్ల విజయావకాశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
పాకిస్తాన్ తదుపరి నాలుగు మ్యాచ్‌లు
- అక్టోబర్ 27న దక్షణాఫ్రికాతో(చెన్నై),
- అక్టోబర్ 31న బంగ్లాదేశ్‌తో(కోల్‌కతా),
- నవంబర్ 4న న్యూజిల్యాండ్‌తో(బెంగళూరు),
- నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో(కోల్‌కతా)..
పాకిస్తాన్ తదుపరి నాలుగు మ్యాచ్ లను పరిశీలిస్తే.. ఇందులో ఒక్క బంగ్లాదేశ్ పై మాత్రమే గెలవగలదని ధైర్యంగా చెప్పగలం. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే దక్షణాఫ్రికా, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్ పై గెలవటం అసాధ్యం. మరి ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ సెమీస్ చేరేది.. లేనిది కాలమే నిర్ణయించాలి.
అగ్రస్థానంలో టీమిండియా
ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అన్నింటా విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 10 పాయింట్లతో భారత్ టాప్ లో ఉండగా, 8 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఇక 6 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉండగా.. 4 పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది.
Afghanistan's victory over Pakistan heats up the competition for a #CWC23 semi-final spot ?
— ICC Cricket World Cup (@cricketworldcup) October 24, 2023
More stats ➡️https://t.co/YTMRaXOUzN pic.twitter.com/DYituUw2OV