దేశంలో ప్రపంచ కప్ 2023 సందడి మొదలైపోయింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే 10 జట్లు భారత్ చేరుకొని.. వార్మప్ మ్యాచ్‌లు ఆడటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గొనే 10 జట్లు ఏవి..? ఆయా జట్లలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరన్నది తెలుసుకుందాం..
సెప్టెంబర్ 29 నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా, అక్టోబర్ 5 నుండి ప్రధాన మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది.
రౌండ్ రాబిన్ ఫార్మట్
రౌండ్ రాబిన్ పద్ధతిలో వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1992, 2019లో ఈ ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించారు. ఈ పద్ధతిలో గ్రూలు అంటూ ఏమీ ఉండవు. ప్రతి జట్టు లీగ్ దశలో ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సివుంటుంది. ఈ లెక్కన అన్ని జట్లు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడతాయి. అందులో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో చోటు దక్కించుకున్న జట్లు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
పాల్గొనే 10 జట్లు:
భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్.
మ్యాచ్‌లు జరిగే 10 వేదికలు:
హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతా.
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.
ఇంగ్లాండ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.
ఆస్ట్రేలియా:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
దక్షిణాఫ్రికా:
తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్.
పాకిస్తాన్:
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం.
అఫ్గనిస్తాన్:
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్.
బంగ్లాదేశ్:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్.
శ్రీలంక:
దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక.
నెదర్లాండ్స్:
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్.