హైదరాబాద్‌లో వర్షం.. ఆగిన పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్

హైదరాబాద్‌లో వర్షం.. ఆగిన పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్‌- పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభమైన గంటకే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. అందునా ఈ వర్షం ఒక ఉప్పల్‌లోనే కురుస్తుండటం నగరవాసులకు వింతగా అనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వర్షం అంతరాయం కలిగించే సమయానికి పాక్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(1), అబ్దుల్లా షఫీక్(14)స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. బాబర్ ఆజామ్(36 బ్యాటింగ్), మహ్మద్ రిజ్వాన్(20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు.