వన్డే ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. సోమవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ తలపడనున్నాయి. గత రికార్డుల పరంగా పాకిస్తాన్ బలమైనే జట్టే అయినప్పటికీ.. తమదైన రోజు ఆఫ్ఘన్లు ఏ జట్టునైనా ఓడించగలరు. అదే పాక్‌ను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాక్- ఆఫ్ఘన్ మ్యాచ్ గురుంచి యూట్యూబ్ ఛానెల్‌లో రమీజ్ రాజా.. కాబుల్ సేనతో అప్రమత్తంగా ఉండాలని తమ ఆటగాళ్లకు సూచించాడు. స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్‌పై ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించగలరని అభిప్రాయపడ్డారు. గత రికార్డులు ఎలా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థానే ఫేవరెట్ అని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించారు.
"చెన్నై పిచ్ అంటే.. స్పిన్. అక్కడ ఏదైనా జరగవచ్చు. మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది ఊహించడం కష్టం. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు(రషీద్‌ఖాన్, ముజీబ్, నబి) ఉన్నారన్న విషయాన్ని పాక్ ఆటగాళ్లు గుర్తుంచుకోవాలి. ఇప్పటి ఫామ్‌ను బట్టి వారిపై ఆధిపత్యం చెలాయించడం కొంచెం కష్టమే. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థానే ఫేవరెట్ అని నేను భావిస్తున్నా.." అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు.
ఇప్పటి వరకు ఈ ఇరు జట్ల మధ్య 7 వన్డేలు జరగగా.. అన్ని మ్యాచ్ లోను పాకిస్థాన్ విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ఒక్క గెలుపుతో అఫ్గానిస్థాన్ అట్టడుగున ఉంది.
India pulls clear as the only undefeated team at #CWC23 ?? pic.twitter.com/7TiPwhTcei
— ICC Cricket World Cup (@cricketworldcup) October 23, 2023
తుది జట్లు (అంచనా)
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది , మహ్మద్ వసీం.
ఆఫ్ఘనిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫజల్హఖ్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్.