ODI World Cup 2023: పాండ్యాకు ఫిట్‌నెస్ కష్టాలు.. తదుపరి రెండు మ్యాచ్‌లకు అనుమానమే!

వన్డే ప్రపంచ కప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతున్నా.. హార్దిక్ పాండ్యా లోటు మాత్రం అలానే ఉండిపోయింది. బంగ్లాదేశ్‌ మ్యాచ్ సంధర్బంగా గాయ‌ప‌డ్డ పాండ్యా ఇప్పటికీ జట్టులో చేరలేదు. రేపు, మాపు అని బీసీసీఐ వర్గాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తున్న చివరి నిమిషంలో మాత్రం ఆ ప్రశ్నను దాట వేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పాండ్యా తుదపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడట. పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం.

న‌వంబ‌ర్ 2న శ్రీలంక‌తో, న‌వంబ‌ర్ 5న సౌతాఫ్రికాతో.. భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల షెడ్యూల్ ఇది. ఈ రెండు మ్యాచ్‌లకు పాండ్యా అందుబాటులో ఉండడట. అతను గాయం నుంచి కోలుకున్నా.. మరింత విశ్రాంతి అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో టోర్నీలో చిట్టచివరి లీగ్(భారత్- నెదర్లాండ్స్) నాటికి అతను జట్టులో చేరవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు.

ALSO READ :- NZ vs RSA: డికాక్, డస్సెన్ సెంచరీలు.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్

భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు

  • నవంబర్ 2: శ్రీలంకతో (ముంబై),
  • నవంబర్ 5: దక్షిణాఫ్రికాతో (కోల్ కతా),
  • నవంబర్ 12: నెదర్లాండ్స్‌తో (బెంగళూరు)

ఇదిలావుంటే, గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.