IND vs NZ: రోహిత్ -కోహ్లీ మధ్య వాగ్వాదం.. మ్యాచ్ మధ్యలో ఏం జరిగిందంటే..?

IND vs NZ: రోహిత్ -కోహ్లీ మధ్య వాగ్వాదం.. మ్యాచ్ మధ్యలో ఏం జరిగిందంటే..?

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరివరకూ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (95) చివరివరకూ క్రీజులో నిల్చొని జట్టును ఐదో విజయాన్ని అందించాడు. ఇది నాణేనికి ఇకవైపు మాత్రమే.. ఈ మ్యాచ్‌లో మరో ఘటన కూడా జరిగింది. అదే రోహిత్ -కోహ్లీ మధ్య వాగ్వాదం. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు 19 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఆ జట్టు ఓపెనర్లు డెవాన్ కాన్వే(0),  విల్ యంగ్(17) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. అప్పటికి కివీస్ స్కోర్.. 19/2. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర(75), డారీ మిచెల్(130) జోడి ఆదుకున్నారు. మొదట ఆచి తూచి వీరిద్దరూ.. కుదురున్నాక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఏకంగా మూడో వికెట్ కు 159 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో భారత్ ముందు భారీ స్కోర్ తప్పదనుకున్నారంతా. 

Also Read : ఆడి ఆడి అలిసిపోయా.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆర్‌సీబీ మాజీ స్పిన్నర్‌

కోహ్లీ అగ్రెస్సివ్ లుక్..! 

వీరిని విడదీసేందుకు రోహిత్ ఎన్ని వ్యూహాలు రచించినా వర్కౌట్ అవ్వలేదు. భారత బౌలర్లు చెమటోడ్చినా.. ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ సమయంలోనే కోహ్లీ.. రోహిత్ వద్దకు వెళ్లి సలహాలిచ్చాడు. ఫీల్డింగ్ సెట్ గురుంచి అతనితో ఏదో మాట్లాడాడు. రోహిత్ కూడా నేను అలానే చేశాను అన్నట్లుగా సమాధానమిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కోహ్లీ.. రోహిత్ తో మాట్లాడే తీరు అగ్రెస్సివ్‌గా అనిపిస్తోంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది అనేలా ఈ వీడియో ఉంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. వికెట్లు పడకపోయేసరికి కోహ్లీ.. రోహిత్ వద్దకు వెళ్లి సలహాలిచ్చాడు. అది మాత్రమే వాస్తవం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 273 పరుగులు చేయగా.. భారత బ్యాటర్లు మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించారు.