న్యూఢిల్లీ: ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ అని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో ఇండియా టీమ్ చాలా భిన్నంగా, బలంగా ఆడుతుందన్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో వాళ్లు ఆడిన తీరే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. ‘హోమ్ కండిషన్స్‌లో ఇండియా చాలా భిన్నమైన జట్టు. టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది.
బ్యాటింగ్, బౌలింగ్ ఊహించిన దానికంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంది. రోహిత్, కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. బుమ్రా పేస్‌కు, కుల్దీప్, జడేజా టర్నింగ్ బాగా కుదురుతున్నది’ అని టేలర్ పేర్కొన్నాడు. టాప్–3తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో బ్యాటింగ్ బలం బాగా పెరిగిందన్నాడు. మిగిలిన జట్ల ఫలితాలు ఎలా ఉన్నా.. టోర్నీ ఫేవరెట్ మాత్రం ఇండియానే అని టేలర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భవిష్యత్‌లో రాచిన్ రవీంద్ర కివీస్ జట్టులో చాలా కీలకమవుతాడని రాస్ వెల్లడించాడు. కెప్టెన్ విలియమ్సన్, సౌథీ లేకపోయినా టీమ్ బాగా రాణిస్తోందని ప్రశంసించాడు.
Ross Taylor believes India is the favorite to win the 2023 ODI World Cup#INDvNZ pic.twitter.com/DcUXM6tQ9U
— CricXtasy (@CricXtasy) October 22, 2023