మన దేశంలో క్రికెట్ అంటే పిచ్చి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ క్రికెటర్లే. ఈ ఆటకు ఉన్నంత ఆదరణ మరే క్రీడకు ఉండదు. అలాంటిది వరల్డ్ కప్ మహా సంగ్రామం అంటే మాటలా! వరల్డ్ కప్ సాధించాలని.. విశ్వవిజేతగా నిలవాలని ప్రతి జట్టుకు ఉంటుంది. కానీ, అన్ని జట్లకు ఆ అవకాశం దక్కదు. 48 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఇప్పటివరకూనాలుగు సార్లు ఫైనల్స్ చేరింది. అందులో రెండింట విజయం సాధించగా.. మరొక దానిలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
1983: తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
2003: సెమీస్‌లో కెన్యాపై భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు.. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
2011: సెమీస్‌లో దాయాది పాకిస్తాన్ ను మట్టికరిపించిన టీమిండియా.. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి రెండోసారి విశ్వవిజేతగా అవతరించింది.
2023: 12 ఏళ్ల అనంతరం మరోసారి భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈసారి మన ప్రత్యర్థి ఎవరో గురువారం(నవంబర్ 16) జరిగే ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మ్యాచ్ తో తేలనుంది. ఈ జట్లలో విజయం సాధించిన జట్టే.. మన ఫైనల్ ప్రత్యర్థి.
ఈసారి జరిగే ఫైనల్ 140 కోట్ల మంది ఆశలకు ప్రతిరూపం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు ఆ కలను నెరవేరుస్తుందా! లేదా అనేది నవంబర్ 19న తేలనుంది.
??? ???? ??????! ?#TeamIndia ?? march into the FINAL of #CWC23 ?#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI
— BCCI (@BCCI) November 15, 2023
INDIA REACH THEIR FIRST MEN'S ODI WORLD CUP FINAL SINCE 2011! ?? https://t.co/ptgFIHUKpk | #INDvNZ | #CWC23 pic.twitter.com/8jOSUvpaxN
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2023