ODI World Cup 2023: పరిష్కారం దొరికినట్లే.. భారత జట్టులో కొత్తగా ముగ్గురు ఆల్‌రౌండర్లు

ODI World Cup 2023: పరిష్కారం దొరికినట్లే.. భారత జట్టులో కొత్తగా ముగ్గురు ఆల్‌రౌండర్లు

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఈ టోర్నీలో ఓటమి ఎదరుగన జట్టు ఏదైనా ఉందా అంటే అది మన జట్టే. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో అన్నింటా విజయం సాధించి(10 పాయింట్లతో) టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. ఇలా చెప్పుకోవడానికి అంతా బాగానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా గాయం భారత్‍కు ఇబ్బందిగా మారుతోంది. 

బంగ్లాదేశ్‍ మ్యాచ్‍ సందర్బంగా గాయపడిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చికిత్స పొందుతున్నాడు. గాయం తీవ్రత పెద్దది కాకపోయినప్పటికీ.. అతడు దాన్నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడు జట్టులో చేరడానికి సమయం పట్టేలా ఉంది. ఈ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఆచి తూచి అడుగేస్తోంది. అతడు పూర్తిగా కోలుకున్నాకే బరిలోకి దించాలని భావిస్తోంది. ఈ తరుణంలో జట్టులో అతన్ని లోటును పూడ్చిందేకు ముగ్గురు భారత ఆటగాళ్లు తహతహలాడుతున్నారు.

ALSO READ :ఓడిపోతున్నా వీటికేం తక్కువ లేదు: సౌతాఫ్రికా బౌలర్‌ను దూషించిన పాక్ బ్యాటర్
 

ముగ్గురు ఆల్‌రౌండర్లు

భారత జట్టు సరిగ్గా ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతోంది.  వీరిలో ఎవరైనా విఫలమైతే.. కనీసం నాలుగు ఓవర్లు వేయడానికైనా ఆరో బౌలర్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, సూర్య కుమార్‌లు నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. అవసరమైతే బౌలింగ్ చేయడానికి ముందుగానే సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కొత్త ఆల్ రౌండర్లపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. వీరు పూర్తి కోటా బౌలింగ్ చేస్తే.. సెంచరీ చేయడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.

భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు

  • అక్టోబర్ 29: ఇంగ్లండ్‍తో (లక్నో), 
  • నవంబర్ 2: శ్రీలంకతో (ముంబై),
  • నవంబర్ 5: దక్షిణాఫ్రికాతో (కోల్ కతా),
  • నవంబర్ 12: నెదర్లాండ్స్‌తో (బెంగళూరు)