వన్డే ప్రపంచ కప్ 2023 పోరును ఘనంగా ఆరంభించాలనుకున్న పాకిస్తాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 345 పరుగుల భారీ స్కోరు చేయగా.. అంత పెద్ద లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టు.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (103; 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (80), సౌద్ షకీల్ (75) అర్ధ శతకాలతో రాణించారు. కివీస్ బౌలర్లలో మిషెల్ శాంట్నర్ 2 వికెట్లు తీసుకోగా.. మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Welcome back! 54 from 50 balls for Kane Williamson before being retired in Hyderabad. His first bat in a match since injuring his knee in March. Mitchell joining Ravindra in the middle. 141/1 after 18 overs. 346 the target against Pakistan. LIVE | https://t.co/DOWJ07JPRH #CWC23 pic.twitter.com/x4ty365u9Y
— BLACKCAPS (@BLACKCAPS) September 29, 2023
అనంతరం 345 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు మరో 38 బంతులు మిగిలివుండగానే చేధించారు. ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర (94; 72 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా.. కెప్టెన్ కేన్ విలియంసన్ (54), డారీ మిచెల్(59), మార్క్ చాప్ మెన్ (65) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఉసామా మీర్ 2 వికెట్లు తీసుకోగా.. హసన్ అలీ, అఘా సల్మాన్, మహ్మద్ వసీం జూనియర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
.@SalmanAliAgha1 gets the breakthrough, dismissing Rachin Ravindra for 97@RealHa55an is the other wicket-taker for Pakistan as New Zealand are 205-2 in the 27th over ?#NZvPAK | #CWC23 | #WeHaveWeWill pic.twitter.com/N9xfl7wZg1
— Pakistan Cricket (@TheRealPCB) September 29, 2023
ఇక ఇదే వేదికపై అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.