ప్రపంచ క్రికెట్ యుద్ధం.. హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఆరంభం..

ప్రపంచ క్రికెట్ యుద్ధం.. హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఆరంభం..

వన్డే వరల్డ్ కప్ యుద్ధం మొదలైంది. అది కూడా హైదరాబాద్ వేదికగా ప్రారంభం కావటం విశేషం.. అసలు సిసలు మ్యాచులకు మరో వారం రోజుల సమయం ఉన్నా.. భారత్ వేదికగానే.. ప్రపంచ క్రికెట్ జట్లు అన్నీ ప్రాక్టీస్ చేయటం విశేషం. క్రికెట్ యుద్ధంలో తమ సత్తా చూపించటానికి.. వాతావరణం అలవాటు పడటానికి.. స్థానిక పరిస్థితులను అంచనా వేయటానికి.. ఆయా జట్ల బలాబలాలను తెలుసుకోవటానికి ఈ వార్మప్ మ్యాచులు కీలకంగా మారనున్నాయి.

క్రికెట్ కప్ వార్మప్ మ్యాచుల ప్రారంభానికి హైదరాబాద్ వేదిక కావటం ఒక విశేషం అయితే.. అందులోనూ పాకిస్తాన్.. న్యూజిలాండ్ జట్లు తలపడటం మరో ఆసక్తికరం. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న రెండు దేశాల జట్లు.. గురువారం హోటళ్లకే పరిమితం అయ్యాయి. శుక్రవారం.. అంటే సెప్టెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు గ్రౌండ్ లోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. రెండు జట్లకు గెలుపు అనేది కిక్ ఇస్తుంది అనటంలో సందేహం లేదు.

ఈ వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడుతుండగా రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ మ్యాచులను నిర్వహించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ మ్యాచులు అభిమానులకు మజా ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ జరగనుంది. తొలిసారి పూర్తి స్థాయిలో భారత్ లో వరల్డ్ కప్ నిర్వహించనుండడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. అయితే అంతకన్నా ముందు వారం పాటు వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు చూడాల్సిందే.  
   
వార్మప్ మ్యాచుల షెడ్యూల్:

సెప్టెంబర్ 29, 2023 - శుక్రవారం
బంగ్లాదేశ్ v శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
దక్షిణాఫ్రికా v ఆఫ్ఘనిస్తాన్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
న్యూజిలాండ్ v పాకిస్థాన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్

సెప్టెంబర్ 30, 2023 - శనివారం
ఇండియా v ఇంగ్లాండ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
ఆస్ట్రేలియా v నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం


అక్టోబర్ 2, 2023 - సోమవారం
ఇంగ్లండ్ v బంగ్లాదేశ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
న్యూజిలాండ్ v సౌతాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

అక్టోబర్ 3, 2023 - మంగళవారం
ఆఫ్ఘనిస్తాన్ v శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
ఇండియా v నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్