ODI World Cup 2023: వార్మప్ మ్యాచులు ఆడనందుకు సంతోషంగా ఉంది: రోహిత్ శర్మ

ODI World Cup 2023: వార్మప్ మ్యాచులు ఆడనందుకు సంతోషంగా ఉంది: రోహిత్ శర్మ

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్న మెంట్ లో వార్మప్ మ్యాచులు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్ల ఫామ్ ని పరీక్షించుకోవడంతో పాటు, పిచ్ మీద ఒక అవగాహన వస్తుంది. అయితే భారత్ కి మాత్రం జరగాల్సిన రెండు వార్మప్ మ్యాచులు రద్దయ్యాయి. అన్ని జట్లకు కావాల్సిన ప్రాక్టీస్ లభించినా.. టీమిండియాకు మాత్రం ఆ అవకాశం రాలేదు. దీంతో వార్మప్ ఆడకుండా వరల్డ్ కప్ మ్యాచ్ ఆడడం భారత్ కి ప్రతికూలంగా భావించారంతా. కానీ రోహిత్ మాత్రం అలా భావించడం లేదు.
 
వరల్డ్ కప్ లో రేపు ప్రారంభం కానుండగా బుధవారం మధ్యాహ్నం కెప్టెన్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 10 జట్ల కెప్టెన్లు పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. ఇందులో భాగంగా వార్మప్ మ్యాచులు రద్దు కావడం మీ విజయాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందని అడగ్గా.. రోహిత్ ఎవ్వరూ ఊహించని సమాధానమిచ్చాడు. "వార్మప్ మ్యాచులు రద్దయినందుకు మాకేమి బాధగా లేదు. ఇంకా చెప్పాలంటే సంతోషంగా ఉంది. మా దృష్టాంతా వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ మీదే ఉంది".అని హిట్ మ్యాన్ తెలిపాడు.

రోహిత్ శర్మ ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లందరూ ఫామ్ లోనే ఉన్నారు. పైగా ఆసియా కప్, ఆస్ట్రేలియాతో సిరీస్ లు గెలిచి కాస్త అలసిపోయారు. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచులు ఆడటం టీమిండియాకు లాభం కంటే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. భారత పిచ్ ల మీద పూర్తి అవగాహన ఉన్న రోహిత్ సేనకు ప్రాక్టీస్ పెద్దగా అవసరం లేదనే చెప్పాలి. కానీ వార్మప్ మ్యాచులు జరిగితే  ప్రత్యర్థులకు మాత్రం భారత్ పై ఎలా గెలవాలో ఒక అంచనా వస్తుంది.  ఒకవేళ వార్మప్ మ్యాచుల్లో స్టార్ ప్లేయర్లు ఎవరైనా గాయపడితే ఆ ప్రభావం వరల్డ్ కప్ మ్యాచులపై ఖచ్చితంగా పడుతుంది.