క్రికెట్ ప్రపంచాన్ని.. అభిమానులను ఉర్రూతలు ఊగించే.. అతి పెద్ద క్రికెట్ టోర్నమెంట్ కౌంట్ డౌన్ మొదలైంది. అది కూడా హైదరాబాద్ నుంచే మొదలు కావటం విశేషం. వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. లాహోర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు వస్తుంది.
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా 2023, సెప్టెంబర్ 29వ తేదీ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. గణేష్ నిమజ్జనం కారణంగా.. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ జట్టు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకోనుంది.
Also Read :- కోహ్లీ ప్లేస్ కొట్టేసిన అయ్యర్.. మూడో వన్డేలో ఓపెనర్ గా విరాట్..?
పాకిస్తాన్ జట్టులో 18 మంది ఆటగాళ్లు, 13 మంది అధికారుల బృందం.. మొత్తం 32 మంది ప్రత్యేక విమానంలో లాహోర్ నుంచి బయలుదేరి.. దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హోటళ్లకు చేరుకోనున్నారు పాక్ ఆటగాళ్లు.
Embarking on the World Cup quest ?#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/AKwrf1yCkQ
— Pakistan Cricket (@TheRealPCB) September 26, 2023