లెజెండరీ ఒడియా రచయిత్రి బినాపాని మొహంతి ఇక లేరు. వృద్ధాప్యం సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ..ఆదివారం రాత్రి కటక్‌లోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బినాపాని 100కు పైగా పుస్తకాలను రచించారు. ‘పాటదేయ్’, ‘కస్తూరి మృగ ఓ సబుజా అరణ్య’, ‘ఖేలా ఘరా’, ‘నాయకు రాస్తా’, ‘బస్త్రాహరణ’, ‘అంధకారారా’ పుస్తకాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
2020లో బినాపాని పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. గతంలో ఆమె సాహిత్య అకాడమీ అవార్డు, సరళ సమ్మాన్ లాంటి మరెన్నో అవార్డులను పొందారు. ఆమె రాసిన కష్మకష్ కథను దూరదర్శన్ లో ప్రసారం చేశారు.
బినాసాని మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను కలిచి వేసిందని ట్వీట్ చేశారు. ఒడిశా సాహిత్య రంగానికి బినాపాని చేసిన సేవలు మరవలేనివని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
PM Modi expresses condolences over legendary Odia writer Binapani Mohanty's demise
— ANI Digital (@ani_digital) April 25, 2022
Read @ANI Story | https://t.co/WYGJt2N86C#PMModi #BinapaniMohanty pic.twitter.com/TOe8bxIuBS
మరిన్న వార్తల కోసం..
సమ్మర్లో.. నల్ల కళ్లద్దాలు పెట్టాల్సిందే
లగ్జరీ కార్లకు పెరుగుతున్న ఆర్డర్లు