ముగిసిన ఒడియా ఫుడ్​ అండ్ ​క్రాఫ్ట్ ఫెస్టివల్

ముగిసిన ఒడియా ఫుడ్​ అండ్ ​క్రాఫ్ట్ ఫెస్టివల్

మాదాపూర్, వెలుగు: స్వాభిమాన్ ఒడియా ఉమెన్​వరల్డ్ ​ఆధ్వర్యంలో మాదాపూర్ ​శిల్పారామంలో నిర్వహించిన ఒడియా ఫుడ్ ​అండ్ ​క్రాఫ్ట్ ​ఫెస్టివల్​ఆదివారం ముగిసింది. ఐపీఎస్​డా. సౌమ్య మిశ్ర, కార్డియాలజిస్ డా. భరత్​పురోహిత్, పద్మశ్రీ పతయత్​సాహూలు ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​లు గా హాజరయ్యారు. 

మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్​లో సిటీలోని ఒడిశాకు చెందిన  కుటుంబాలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కథక్, ఒడిస్సీ, సంబల్పూరి, ఒడియా జానపద పాటలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన ఒడిశా వంటకాలు నోరూరించాయి.