![శిల్పారామంలో ఒడియా మేళా షురూ](https://static.v6velugu.com/uploads/2025/02/odia-food-festival-silparam_GO7KDXHTm2.jpg)
మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం ఒడియా ఫుడ్ ఫెస్టివల్, క్రాఫ్ట్ మేళా మొదలైంది. 30 మంది ఒడియా చేనేత కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. లేఖ, సింఘా కామ, డోక్రా, ఆర్ట్, పిపీలి అప్లిక్యూ వర్క్, సంబల్పూరి, కోటపాడు, టుస్సార్ చీరలు వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
రసగుల్లా, ఆలూదుమ్ వంటి వంటకాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మేళా మూడురోజులు కొనసాగనుంది. శుక్రవారం సాయంత్రం దేబస్రి పట్నాయక్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం, ఒడియా పాటలు, నృత్యాలు ఎంతగానో అలరించాయి. మేళా ప్రారంభోత్సవంలో ఐఏఎస్ ఆఫీసర్ బీపీ ఆచార్య, ఎన్ఎండీసీ మాజీ డైరెక్టర్ డీకే మొహంతి, సైంటిస్ట్ గగన్ బిహారి రౌత్ పాల్గొన్నారు.