సిటీ జర్నలిస్టుకు ఒడిశా ప్రభుత్వ అవార్డు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​కు చెందిన సీనియర్​జర్నలిస్ట్​ షేక్​ఇస్లాముద్దీన్ ను ఒడిశా ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. నేషనల్ ప్రెస్ డేను పురస్కరించుకుని శనివారం రాత్రి భువనేశ్వర్​లో నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు(ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేడబ్ల్యూబీ) దూరదర్శన్ కేంద్రం, ఏఐఆర్, రీజనల్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీచ్ బోర్డు, ఫీల్డ్ ఔట్రీచ్ బోర్డు, అకాడమీ ఆఫ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, అక్కడి రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూజారి పాల్గొని అవార్డులు అందజేశారు. ఇస్లాముద్దీన్​తో పాటు  వివిధ రాష్ట్రాలకు చెందిన మరో ఏడుగురిని ఎంపిక చేసిన ఒడిశా సర్కార్​అవార్డులు అందజేసింది.