దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత ...సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత ...సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా
  • తీర ప్రాంత ప్రజల తరలింపు

కటక్‌‌‌‌:  దానా సైక్లోన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్  హైఅలర్ట్​ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్స్ ను శనివారం వరకూ మూసివేశారు. అలాగే, ఆదివారం జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 – -24ను ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్​సీ) వాయిదా వేసింది. దానా తుఫాను గురువారం రాత్రి పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావంతో 100, -110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తుఫాను నేపథ్యంలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలందరూ సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. తీర ప్రాంతాల్లోని మొత్తం 10 లక్షల మందికి పైగా ప్రజలను తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు.