మూడు రకాల జాతుల మొసళ్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. మహానది సట్కొసియా టైగర్ రిజర్వ్ లో మంచి నీటిలో జీవించే గరియాల్ జాతి మొసళ్లు ఉన్నాయి. మగ్గర్స్, సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ ఉన్నాయి. అంతరించే దశలో ఉన్న ఘరియల్ జాతి మొసళ్లు దాదాపు 43 ఏళ్ల తర్వాత సట్కొసియాలోని బలద్మారా ఏరియాలో న్యాచురల్ నెస్టింగ్ చేస్తున్నాయన్నారు అధికారులు. ఇవి ఎక్కువగా నీరు లోతు లేని ప్రాంతంలో గుడ్లు పెడుతాయంటున్నారు. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు, డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నామన్నారు. మహానదిలో గత మూడేళ్లలో 13కు పైగా గరియల్ జాతి మొసళ్లను విడిచిపెట్టారు. అందులో 8 మాత్రమే బతికాయి. గరియాల్ జాతి మొసళ్లను మొదటిసారిగా 1975లో మహానదిలో విడిచిపెట్టారు.