- ఎన్నికల ర్యాలీలో ఒడిశా సీఎం విజ్ఞప్తి
కోరాపుట్(ఒడిశా): రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అబద్ధాలు చెబుతున్నాయని ఒడిశా సీఎం, బీజేడీ ప్రెసిడెండ్ నవీన్ పట్నాయక్ ఆరోపించారు. కోరాపుట్, నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేద, గిరిజన ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రజలు అవునంటూ అరుస్తూ సమాధానమిచ్చారు. ‘‘నవీన్ పట్నాయక్ మంచివాడని మీరు నమ్మితే.. శంఖం గుర్తుకు ఓటు వేసి మా పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించండి. ప్రతిపక్ష నేతలు ప్రజల కోసం మొసలి కన్నీరు కారు స్తున్నారు. వారితో జాగ్రత్త’’ అని చెప్పారు.