ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 2020 మార్చి 31 వరకు తన ఆస్తి విలువ మొత్తం రూ. 64.98 కోట్లని వెల్లడించారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు తన ఆస్తి రూ.71 లక్షలు పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి వెల్లడించిన లెక్కల ప్రకారం, అతని మొత్తం ఆస్తులు రూ.64 కోట్ల 98 లక్షల19 వేల 763 గా ఉన్నాయి, ఇందులో చరాస్తుల విలువు రూ. కోటి 34 లక్షల 4 వేల 503 అని.. స్థిరాస్తి విలువ రూ.63 కోట్ల 64 లక్షల 7 వేల 261 అని వెల్లడించారు. బ్యాంకుల్లో డిపాజిట్ విలువ 60.45 లక్షల నుంచి రూ. 1.31 కోట్లకు పెరిగిందన్నారు.
అంతేగాకుండా నవీన్ పట్నాయక్ కు 1980 మోడల్ అంబాసిడర్ కారు ఉందని..దాని విలువ 8905 అని చెప్పారు. రూ.2,89,587 విలువ గల బంగారు అభరణాలున్నాయన్నారు. ఫరీదాబాద్‌లోని తిక్రీ ఖేరా గ్రామంలో 2017 మార్చిలో చేసిన విలువ ప్రకారం రూ .10,75,51,071 విలువ గల 22.7 ఎకరాల విస్తీర్ణంలో సిఎంకు వ్యవసాయ భూమి, భవనం ఉంద్నారు.