ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. రేపు హైదరాబాద్ లో జరిగే ఒడిశా ఇన్వెస్టర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇన్వెస్టర్స్ మీట్లో ఐటీ సెక్టార్లో పెట్టుబడులపై ఫోకస్ పెడతామని ఒడిశా సీఎంఓ ట్వీట్ చేసింది.
ఐటీ, విద్యుత్తు, చేనేత, మైనింగ్, మిషనరీ, ఉక్కు, అల్యూమినియం, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో పెట్టుబడులపై సీఎం చర్చిస్తారని ఒడిశా మంత్రి ప్రతాప్ తెలిపారు. రాష్ట్రంలోని, ఖనిజ సంపదల నిల్వలు, నిర్మాణాలు చేసేవారికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తారన్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు భువనేశ్వర్‌లో ఏర్పాటయ్యే 5 రోజుల మేకిన్ ఒడిశా సదస్సులో పాల్గొనాలని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారని చెప్పారు. మేకిన్ ఒడిశా సదస్సు తర్వాత పారిశ్రామిక రంగం పరుగులు తీస్తుందని వివరించారు.