ఘోర ప్రమాదం..రెండు ట్రక్కులు ఢీ కొని ఏడుగురు దుర్మరణం

ఘోర ప్రమాదం..రెండు ట్రక్కులు ఢీ కొని ఏడుగురు దుర్మరణం

ఒడిశాలోని జాజ్ పుర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ధర్మశాల పీఎస్ పరిధిలోని నెయిల్‌పూర్ సమీపంలో NH-16లో రెండు ట్రక్కులు ఢీ కొనడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన ధర్మశాల పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఏడుగురు వ్యక్తులతో  కోల్‌కతా వైపు వెళ్తున్న ఓ ట్రక్కు .. ఆగి ఉన్న మరో ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని  ధర్మశాల పోలీసులు తెలిపారు.  ఆరుగురు అక్కడిక్కడే మరణించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని చెప్పారు.  మృతులంతా  పశ్చిమబెంగాల్ కు చెందిన వారీగా గుర్తించారు.