రమేష్ స్వైన్‌పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు

రమేష్ స్వైన్‌పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు

ఫిబ్రవరి 2023లో అరెస్టయిన రమేష్ స్వైన్ పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం 10రాష్ట్రాల్లో 27మందిని పెళ్లి చేసుకుని, లక్షలు దోచేశాడన్న ఆరోపణలతో ఒడిశా పోలీసులు రమేష్ ను అరెస్చు చేశారు. రమేష్ స్వైన్ అలియాస్ బిబూ ప్రకాశ్ స్వైన్ 2011లో రూ.2కోట్ల చీటింగ్ కేసులో హైదరాబాద్ లో అరెస్టయ్యాడు. ఈ కేసులో తమ పిల్లలకు ఎంబీబీఎస్ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి, 2006లో 128 నకిలీ క్రెడిట్ కార్డుల ద్వారా కేరళలోని 13 బ్యాంకులను రూ.కోటి వరకు మోసం చేసినట్టు అతనిపై ఆరోపణలున్నాయి. 

ఇక ఇటీవల ఒడిశాలో నమోదైన కేసులో రమేష్ తో పాటు అతని భార్యలను, డా. కమలా సేతి, అతని సోదరి, డ్రైవర్లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వీరందరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఒడిశా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత తాజాగా రమేష్ స్వెయిన్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్వైన్  ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోందని, ఏజెన్సీ ఏదో ఒక సమయంలో అతనిని విచారణ కోసం రిమాండ్ కోరవచ్చని అధికారులు తెలిపారు.