చైల్డ్ మ్యారేజెస్ గురించి సమాచారం ఇస్తే రూ. 5 వేలు బహుమతి ఇస్తామని ఒడిశాలోని గంజాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. గంజాం జిల్లా కలెక్టర్ విజయ అమృత కులంగే ఈ వివరాలు వెల్లడించారు. “బాల్య వివాహాలు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లే. గ్రామపెద్దల కోపానికి గురి కావాల్సి ఉంటుందని అందరూ భయపడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారి వివరాలు సీక్రెట్ గా ఉంచుతాం. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఫండ్స్ నుంచి ఈ క్యాష్ రివార్డు ఇస్తాం” అని అన్నారు. ఎన్జీఓలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కలిసి గత ఏడాది 38 బాల్య వివాహాలను ఆపినట్లు తెలిపారు. సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే బాలికల జీవితాలను కాపాడినవారు అవుతారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైల్డ్ మ్యారేజెస్ కు వ్యతిరేకంగా గత నెల’ ము సచేతన్’ (నాకు తెలుసు) పేరుతో 3 వేల స్కూళ్లలోని 4.50 లక్షల మంది స్టూడెంట్స్, అంగన్ వాడీ వర్కర్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్లతో ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన నాయకులతో మాట్లాడి చైల్డ్ మ్యారేజెస్ గురించి అవగాహన కల్పించామన్నారు.
చైల్డ్ మ్యారేజెస్ పై ఇన్ఫర్మేషన్ ఇస్తే..5 వేల బహుమతి
- దేశం
- December 11, 2019
లేటెస్ట్
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి మాకు రెఫరండమే
- శాతవాహన వర్సిటీ పీహెచ్ డీ నోటిఫికేషన్ రిలీజ్
- కాజీపేట- కొండపల్లి మార్గంలో పలు రైళ్లు రద్దు
- అదుపుతప్పి 8 పల్టీలు కొట్టిన కారు..కారులోని ఐదుగురూ సేఫ్
- కేజ్రీవాల్ విచారణకు ఈడీకి అనుమతిచ్చిన ఎల్జీ
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ల పరిశీలన
- సిరిసిల్ల నేతన్నలకు మరో భరోసా
- పాక్‌లో టెర్రర్ అటాక్.. 16 మంది జవాన్ల మృతి
- పుస్తక పఠనంతో లోతైన విజ్ఞానం సాధ్యం
- అన్ని మతాల్ని సమానంగా చూస్తం
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...