ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. నౌపడ్ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ దగ్గర ఏసీ కోచ్ కింది నుంచి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి కిందకు దూకేశారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. ఈ ట్రైన్ ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ నుంచి పూరీ వెళ్తోంది.