![నవంబర్ 30 వరకు ఒడిశాలో లాక్‌డౌన్](https://static.v6velugu.com/uploads/2020/10/odis.jpg)
ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో లాక్‌డౌన్ గడువును మరింత పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్ జోన్‌లకు ఈ లాక్‌డౌన్ పొడిగింపు వర్తిస్తుందని ఆ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా నవంబర్ 30 వరకు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలను మూసే ఉంచాలని ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. అయితే… 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రం నవంబర్ 16 నుంచి ఆయా పాఠశాలల పర్యవేక్షణలో తరగతులు నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది.
ఒడిశాలో ఇప్పటివరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా… అందులో 273,838 మంది డిశ్చార్జ్ అయ్యారు.