ఒడిశా యూనిఫాం సర్వీసెస్​లో అగ్నివీర్​లకు10% కోటా

ఒడిశా యూనిఫాం సర్వీసెస్​లో అగ్నివీర్​లకు10% కోటా
  • కేబినెట్​ భేటీలో ఆమోదం

భువనేశ్వర్: యూనిఫామ్ సర్వీసుల్లో మాజీ అగ్నివీర్​లకు 10 శాతం రిజర్వేషన్​ను అమలు చేసేందకు ఒడిశా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం భువనేశ్వర్​లో ఆ రాష్ట్రం సీఎం మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన కేబినెట్​సమావేశం జరిగింది. యూనిఫామ్ సర్వీసుల్లో మాజీ అగ్నివీర్​ల కోసం 10 శాతం సీట్లను రిజర్వ్ చేసేందుకు ఒడిశా ప్రభుత్వం.. ఒడిశా ఎక్స్-అగ్నివీర్స్ (యూనిఫాం సర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) రూల్స్–2024ను రూపొందించేందుకు ఈ భేటీలో ఆమోదం తెలిపింది.

హారిజంటల్ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఒడిశా పోలీసు, అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక, ఇతర యూనిఫామ్​ సర్వీసుల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలు పొందేందుకు మాజీ అగ్నివీరులకు అవకాశాలు పెరుగుతాయి. సంబంధిత రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ లోని పోస్టులకు నిర్దేశించిన కనీస అర్హతలను వారు పూర్తి చేస్తే, గరిష్ట వయోపరిమితిలో మూడు సంవత్సరాల సడలింపు, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది.