హ్యాట్సాప్ సార్ : హాకీ కోసం క్లాసులు పెట్టండి.. పిల్లలతో ఆడించండి.. ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

హ్యాట్సాప్ సార్ : హాకీ కోసం క్లాసులు పెట్టండి.. పిల్లలతో ఆడించండి.. ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత మువ్వెన్నల జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల చరిత్రలో భారత క్రీడాకారులు తొలిసారి వంద పతకాలు దాటించారు. మొత్తం పతకాల సంఖ్య 107 కాగా.. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. ఈ పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించగా.. మహిళల జట్టు కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో హాకీని ప్రోత్సహించేందుకు ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హాకీ క్రీడా చరిత్రను చాటిచెప్పేందుకు ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని రాష్ర ఉన్నత విద్యాశాఖ లేఖ ఆదేశించింది.

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం భారతీయ హాకీ చరిత్రను, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ చాటిచెప్పాలని రాష్ట్రంలోని కళాశాలలను కోరింది. అందుకు ప్రతి సోమవారం పాఠశాల ఆవరణాల్లో విద్యార్థి సమ్మేళనాన్ని నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వేతర కళాశాలలు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు రాష్ర ఉన్నత విద్యాశాఖ లేఖ రాసింది. ఆ సమయంలో విద్యార్థులు చదవాల్సిన ముసాయిదా సందేశాన్ని కూడా రాసి పంపింది.

ALSO READ: దేవుడయ్యా మన రింకూ సింగ్: ఆలయ నిర్మాణానికి 11 లక్షల విరాళం

ఇదొక రాజకీయం..!

నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు జే నారాయణ్ మిశ్రా స్పందిస్తూ.. "ఆదివాసి యువకులు హాకీ ఆడే సుందర్‌గఢ్, సంబల్‌పూర్, జార్సుగూడ జిల్లాలలో గిరిజన యువకుల ఓట్లు పొందడం కోసం చేస్తున్న ప్రయత్నమని ఎద్దేవా చేశారు. ముందుగా అన్ని పాఠశాలల్లో హాకీ కిట్లు, విద్యార్థులు ఆడేందుకు కావాల్సిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.