నిరుద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం 20వేల జూనియర్ టీచర్ (స్కీమాటిక్) ఖాళీల భర్తీకి ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ (OSEPA) ఆదివారం(సెప్టెంబర్ 10) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 13న ప్రారంభమై అక్టోబర్ 10న ముగియనుంది
మొత్తం ఖాళీలు: 20,000
అర్హత ప్రమాణాలు:
విద్యార్హతలు: 1 నుండి 5 తరగతులకు బోధించడానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. 12వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఒడిశా ఉపాధ్యాయ అర్హత పరీక్ష-I (OTET-I)లో కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
6 నుండి 8 తరగతులకు బోధించడానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మరియు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 11. 09. 2023 నాటికి అభ్యర్థుల వయసు18 నుండి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలంటే..?
- మొదట ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ యొక్క అధికారిక వెబ్‌సైట్ osepa.odisha.gov.inకి వెళ్లండి.
- అనంతరం హోమ్‌పేజీలో జూనియర్ టీచర్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.
- ఆపై అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించి.. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- చివరగా మీ వివరాలను మరొక సారి సరిచేసుకొని, ఫారమ్‌ను సమర్పించండి.
మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)లో వారి మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలకై అభ్యర్థులు osepa.odisha.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.