ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కలుగజేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఇంటర్ నెట్ ఎంత అవసరమో అంచనా వేసిన ఒడిషా సర్కార్ అక్కడి యూనివర్శిటీల్లో విద్యార్థులకు ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రమాకాంత నాయక్ .. ప్రభుత్వ పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లకు ఉత్తర్వులు జారీ చేశారు.
యూనివర్శిటీల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఆన్ లైన్ స్టడీ మెటీరియల్స్... ఇతర ఈ బుక్స్ డౌన్ లోడ్ చేసుకొనేందుకు యూనివర్శిటీ క్యాంపస్ లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కలుగజేసేందుకు ఒడిషా ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది.దీనికి సంబంధించి అన్నీ అంశాలతో కూడిన అంచనా వ్యయాన్ని తెలపాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్ లను విద్యాశాఖ కోరింది. ప్రస్తుతం ఆన్ లైన్ మెటీరియల్ పై విద్యార్థులు ఆధారపడుతున్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రమాకాంత్ తెలిపారు.
జనానికి మరింత దగ్గరయ్యేందుకు . దీపావళి పండుగ సందర్భంగా ఒడిషా అధికార పార్టీ యూనివర్శిటీలకు ఇప్పుడు ఫ్రీ వైఫై సర్వీస్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అర్బన్ ఏరియాలు, యూనివర్శిటీలకు ఫ్రీ వైఫై ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. . పట్టణాలు, యూనివర్శిటీల్లో వైఫై ఫ్రీ సర్వీస్ ఇచ్చేందుకు ఫైళ్లు కదులుతున్నాయి.
ALSO READ :- ODI World Cup 2023: అతని సలహాతోనే ధోనీని కెప్టెన్ చేశారు: బీసీసీఐ సెక్రటరీ జైషా