ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిషోర్ దాస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలో మంత్రిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆస్పుపత్రికి తరలించారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కాల్పలు జరిగాయి. మంత్రి వాహనం దిగిన తర్వాత గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనుక కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యకర్తలు ధర్నా చేయడంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.
బీజేడీ సీనియర్ నాయకుడైన నబకిషోర్ దాస్ ఇటీవల మహారాష్ట్రలోని ఒక ఆలయానికి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు కలశాలను విరాళంగా ఇచ్చివార్తల్లో నిలిచారు . దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోఒకటైన శని శింగనాపూర్ ఆలయానికి దాస్ 1.7 కిలోల బంగారం, 5 కిలోల వెండితో చేసిన కలశాలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.