రైలు నుంచి జారి పడి ఒడిశా కూలీ మృతి

గద్వాల, వెలుగు: పండుగకు ఊరెళ్తూ ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడి ఒడిశాకు చెందిన వలస కూలీ చనిపోయాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కథనం ప్రకారం..ఒడిశాలోని న్యూపాడ జిల్లా బాబుపాలి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ సాబార్​(40) బెంగళూర్​ సమీపంలో సిమెంట్ బ్రిక్స్​ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు.

ఇతడు స్వగ్రామంలో జరిగే పండుగకు భార్య లంబేసాబర్, కొడుకు మేఘనాథ్ తో కలిసి యశ్వంతపూర్ నుంచి కోర్బా వెళ్తున్న ఎక్స్ ప్రెస్  ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు. బుధవారం గద్వాల మండలం పూడూరు ఎర్రవల్లి గ్రామం వద్ద రైలు నుంచి జారి పడడంతో తలకు గాయమై అక్కడికక్కడే చనిపోయాడు.