తాచు పాము గాయపడిందని ఓ జంతు ప్రేమికుడు మామూలు హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. దీంతో అక్కడి సిబ్బంది పామును చూసి షాక్ అయ్యారు. ఈఘటన ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. మనోజ్ కుమార్‌దాస్ (59) అనే అతను విశ్రాంత ఆర్మీ ఎంప్లైయ్. అతను పదేళ్లుగా పాములను రక్షిస్తున్నాడు. శనివారం ఓ ఇంట్లోకి తాచుపాము వచ్చిందని మనోజ్‌కు ఫోన్ చేశారు. ఆ పాము అప్పటికే ముంగీసను మింగి కదలలేకపోవడంతో ఎవరో దాన్ని కొట్టారని గుర్తించాడు కుమార్ దాస్.
పామును పట్టుకున్న కుమార్ దాస్ చికిత్స కోసం జంతువుల హాస్సిటల్ కు తీసుకెళ్లాడు. ఆ హాస్పిటల్ మూసివుండటంతో.. మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడు. అయితే ఆ పాముకు వైద్యం చేయించడానికి ఓపీ తీసుకున్నాడు. పాము మగదని.. దాని పేరు ‘సపా’ అని ఓపీలో రాయించాడు. అక్కడి సిబ్బందికి వైద్యం చేయించుకునేది ఎవరనేది అప్పటివరకు తెలువదు. తీరా పేషెంట్ ఎవరనేది అడిగితే.. బ్యాగులోంచి పామును తీశాడు. అయితే దానికి కట్టు కట్టేందుకు ఒప్పుకోలేదు సిబ్బంది. యాంటీ సెప్టిక్ క్రీంను సూచించిన ఓ వైద్యుడు పామును జంతువుల హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించాడు. అయితే తాను జంతువుల హాస్పిటల్ కూడా 24గంటలు తెరిచి ఉంచాలని చెప్పెందుకే మామూలు హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు కుమార్ దాస్ తెలిపారు. అయితే పాముకు చికిత్స అందించిన తరువాతనే సోమవారం అడవిలో వదిలేసినట్లు చెప్పాడు.