దేశ వ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 200 పైనే పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు దొంగల అవతారం ఎత్తుతున్నారు. ఎక్కవ ధరకు టమాటాలను కొనుగోలు చేయలేక చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఒడిశాలో మాత్రం ఓ వ్యక్తి సరికొత్త ఐడియాతో టమాటాల ఎత్తుకెళ్లాడు. టమాటా వ్యాపారిని బురిడీ కొట్టించి ఓ కేటుగాడు టమాటాలు ఎత్తుకెళ్లిన ఘటన షాకింగ్ కు గురి చేస్తోంది.
ఒడిశా రాష్ట్రం కటక్ లో కిలో టమాటా రూ. 200 పైనే పలుకుతుంది. దీంతో అధిక ధరకు టమాటాలను కొనుగోలు చేయలేక అమన్ అనే వ్యక్తి..టమాటాల చోరీ కోసం ప్లాన్ చేశాడు. వాషింగ్ మెషీన్ ను తరలించాలంటూ ఇద్దరు పిల్లలను పని కోసం అని తీసుకున్నాడు. వాళ్లకు 300 రూపాయలు చెల్లిస్తానని చెప్పాడు. సరే అన్న ఆ పిల్లలు.. పని కోసం అమన్ వెంట వెళ్లారు. ఆ కంత్రీగాడు..మార్గ మధ్యలో ఛట్రా బజార్ లోని కూరగాయల దుకాణంలో టమాటాలు కొందామని పిల్లలను ఆగమన్నాడు. ఈ క్రమంలోనే 10 కిలోల టమటాల కోసం బేరం వ్యాపారితో బేరం ఆడాడు. అయితే చివరకు కేటుగాడు నాలుగు కిలోల టమాటాలు తీసుకున్నాడు. మిగతా కూరగాయలు కొనుగోలు చేసి వస్తాను.. అప్పటి వరకు మా పిల్లలు నీ దుకాణం దగ్గరే ఉంటారు.. మళ్లీ వచ్చి డబ్బులు ఇస్తానని కట్టు కథ చెప్పాడు. పిల్లలు ఎటూ ఇక్కడే ఉన్నారు కదా.. 800 రూపాయలు ఎక్కడికిపోతాయిలే అనుకున్న కూరగాయల షాపు యజమాని సరే అన్నాడు..
టమాటా వ్యాపారిని నమ్మించి కంత్రీగాడు అమన్.. నాలుగు కిలోల టమాటాలతో అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి అమన్ తిరిగి రాకపోవటంతో.. అనుమానం వచ్చిన కూరగాయల షాపు యజమాని.. మీ డాడీ రాలేదు ఏంటీ అని అన్నాడు.. అతను మా నాన్న కాదు.. పని ఇస్తాను.. 300 రూపాయలు ఇస్తాను అంటే అతనితో వచ్చాం అని చెప్పారు.. అప్పుడు ఆ కూరగాయల షాపు యజమాని షాక్ అయ్యాడు.