రాక్షస ఆనందం : కింగ్ ఫిషర్ పక్షిని వేధించిన వ్యక్తి అరెస్ట్

రాక్షస ఆనందం : కింగ్ ఫిషర్ పక్షిని వేధించిన వ్యక్తి అరెస్ట్

సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏ మూల ఏ ఘటన  జరిగినా అది సామాజిక మాధ్యమాల్లో షేరింగ్ అవుతుంది.  మరీ జంతువులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పనక్కర లేదు.  ఇప్పుడు ఒడిశాలో ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ పక్షి పట్ల తన శాడిజాన్ని ప్రదర్శించాడు.  ఈ వీడియో వైరల్ అయిన తరువాత ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఈ వీడియోలోని  పక్షిని కింగ్‌ఫిషర్‌గా గుర్తించారు. నిందితుడు గురుదలే అతని వినోదం కోసం దాని తల , ముక్కును పట్టుకున్నాడు. ఆ పక్షి  ఊపిరి పీల్చుకోవడానికి... విడిపించుకోవడానికి పోరాడుతున్నట్లు స్పష్టంగా కనపడింది. 

నేటి సమాజంలో జంతు హింస తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది మానవులు జంతువులను , పక్షులను కావాలని  చంపితే, మరికొందరు కేవలం వినోదం కోసం క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నిందితుడు తన సరదా కోసం  కింగ్‌ఫిషర్ పక్షిని పట్టుకుని హింసిస్తున్న వీడియో  వైరల్‌గా మారింది.  ఈ వీడియోను నిందితుడు గురుదలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  ఆ తర్వాత దానిని ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా తన ఖాతాలో ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

కేంద్రపాడ జిల్లా పట్టపారియా గ్రామానికి చెందిన గురు దలే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతోనే  అతడిని డబ్ల్యూఎల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. తరువాత అతని ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాను సస్పెండ్ చేశారు. గత నెలలో కూడా మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఒక వ్యక్తి నెమలి ఈకలను తీసివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
https://twitter.com/susantananda3/status/1669203365123981312