ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ లోని మంత్రులందరూ రాజీనామా చేయాలనీ అదేశించారు. దీంతో వారందరూ రాజీనామా చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Cabinet reshuffle in Odisha | All the Ministers in the state cabinet have resigned, new Ministers will take oath tomorrow at 12pm: Official Sources pic.twitter.com/4OoYlFAH41
— ANI (@ANI) June 4, 2022
సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతా దళ్ ప్రభుత్వానికి అయిదోసారి మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రోకి సీఎం తన మంత్రివర్గంలో కీలక పదవిని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. కాగా జూన్ 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.