ఉన్నతి హుడా.. తన పేరుకు తగ్గట్టుగానే చిన్న వయసులోనే ‘ఉన్నత’ రికార్డ్ సాధించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిర్వహించే సూపర్ 100 టోర్నమెంట్ టైటిల్‌ను 14 ఏండ్ల వయసులోనే సొంతం చేసుకుంది. ఇంత చిన్న వయసులో ఈ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఒడిశాలోని కటక్‌లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న సూపర్ 100 టోర్నమెంట్ (ఒడిశా ఓపెన్ 2022)లో సింగిల్స్ విమెన్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది భారత ప్లేయర్ ఉన్నతి హుడా. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి అయిన 21 ఏళ్ల తోష్నీవాల్‌పై 18,21 తేడాతో ఒక సెట్, 11,21 తేడాతో మరో సెట్‌ను ఉన్నతి కైవసం చేసుకుంది. తిరుగులేని ఆధిక్యంతో అతి చిన్న వయసులోనే విమెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. అతి చిన్న వయసులోనే ఈ టైటిల్ సొంతం చేసుకున్న ఇండియన్ ప్లేయర్‌గా ఘనత సాధించింది ఉన్నతి.
Odisha Open: 14-year-old Unnati Hooda overcomes Smit Toshniwal in final, becomes youngest Indian to win Super 100 event
— ANI Digital (@ani_digital) January 30, 2022
Read @ANI Story | https://t.co/WfvEIxivBG#OdishaOpenSuper100 pic.twitter.com/gYTm0rUKzx
విమెన్స్ డబుల్స్‌లో జోలీ, గాయత్రి గోపీచంద్ జోడీ విజయం
విమెన్స్ డబుల్స్ టోర్నీలో సన్యోగితా ఘోర్పడే, శ్రుతి మిశ్రాలపై ట్రీసా జోలీ, గాయత్రి గోపీచంద్‌ల జోడీ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో 12, 21 తేడాతో ఒక సెట్‌ను, 10, 21 పాయింట్ల తేడాతో మరో సెట్‌ను జోలీ, గాయత్రి జోడీ సొంతం చేసుకుంది. ఇక మెన్స్ సింగల్స్‌లో ప్రియాన్షు రాజవత్‌పై 21 ఏళ్ల కిరణ్ జార్జ్ విజయం సాధించాడు.
#OdishaOpen2022 #Champions #WomenDoubles - Gayathri G/Treesa J@sports_odisha@BAI_Media@MyDalmiaCement#OdishaOpenSuper100 #IndianBadminton pic.twitter.com/HtxnHIyj9G
— OdishaOpen2022 (@OdishaOpen100) January 30, 2022
#OdishaOpen2022 #Champion #MenSingles - Kiran George ??@sports_odisha@BAI_Media@MyDalmiaCement#OdishaOpenSuper100 #IndianBadminton pic.twitter.com/uAPRUwyPBJ
— OdishaOpen2022 (@OdishaOpen100) January 30, 2022
మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీలంకన్ జోడీ చేతిలో ఓటమి
అన్ని కేటగిరీల్లో టైటిల్స్ సొంతం చేసుకున్న ఇండియాకు మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. శ్రీలంక ప్లేయర్ల చేతిలో ఇండియన్ జోడీ ఓటమిని చవిచూసింది. ఇండియన్ ప్లేయర్ల జోడీ ఎంఆర్ అర్జున్, ట్రీసా జోలీలపై శ్రీలంక ప్లేయర్లు సచిన్ దియాస్, థిలినీ హెందాడహెవా రెండు సెట్లలోనూ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.
#OdishaOpen2022 #Champions #MixedDoubles - Sachin Dias/Thilini Hendahewa ?? @sports_odisha@BAI_Media@MyDalmiaCement
— OdishaOpen2022 (@OdishaOpen100) January 30, 2022
#OdishaOpenSuper100 #IndianBadminton pic.twitter.com/XHEOVxGBY9