పారా అథ్లెట్ కమలాకాంత నాయక్ గిన్నీస్ రికార్డ్‌లో చోటు సాధించాడు. ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన నాయక్.. వీల్ చైర్లో 24 గంటల్లో 215.4 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒడిశాలోని మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్ నుండి రాజ్‌మహల్ స్క్వేర్ సైకిల్ ట్రాక్ పాయింట్ వరకు వీల్ చైర్లో ప్రయాణించాడు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి.. ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు ప్రయాణం చేశాడు. గతంలో 24 గంటల్లో 184 కి.మీ ప్రయాణించిన రికార్డు నాయక్‌కు ఉంది.
గతంలో నాయక్ కళింగ స్టేడియంలో జరిగిన ‘ది ఎబిలిటీ మారథాన్’లో పాల్గొన్నాడు. వీల్‌చైర్ అల్ట్రా మారథాన్‌ను కేవలం 15 గంటల్లో 139.57 కి.మీ పూర్తి చేసిన ఏకైక భారతీయుడు కూడా నాయక్ కావడం గమనార్హం. నాయక్ వీటితో పాటు 2 కి.మీ హాఫ్ మారథాన్‌లో 16 సార్లు మరియు 42 కి.మీ ఫుల్ మారథాన్‌లో 13 సార్లు పాల్గొన్నాడు. నాయక్ ఒడిశా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ జట్టుకు మాజీ కెప్టెన్. నాయక్ 2020 సంవత్సరంలో వీల్‌చైర్‌పై 4,200 కి.మీలకు పైగా ప్రయాణించి రికార్డు సృష్టించాడు.
‘నేను ఈ ఫీట్ సాధించడానికి గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నాను. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఈ ఫీట్ చేరుకున్నాను. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో వీల్‌చైర్ మారథాన్‌లో పాల్గొనడమే నా లక్ష్యం’ అని నాయక్ అన్నారు.
కార్యక్రమానికి హాజరైన సినీనటుడు, సామాజిక కార్యకర్త సబ్యసాచి మిశ్రా మాట్లాడుతూ.. కమలాకాంత పట్టుదల తనలాంటి ఎంతో మందికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. ఏదైనా సాధించాలనే సంకల్పం, తపన ఉంటే ఏ అడ్డంకి కూడా అడ్డుకోలేదనడానికి నాయక్ ప్రయత్నమే నిదర్శనమని సబ్యసాచి అన్నారు.
For More News..
వామ్మో.. జయమ్మ పంచాయితీ మామూలుగా లేదుగా