ఒడిశాలో మాస్కులు పెట్టుకోని 167 మందికి ఫైన్

ఒడిశాలో మాస్కులు పెట్టుకోని 167 మందికి ఫైన్

భువనేశ్వర్: ఒడిశాలో మాస్కులు పెట్టుకోని 167 మందికి పోలీసులు ఫైన్ వేశారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు భువనేశ్వర్, కటక్ లో మాస్కులు తప్పనిసరి చేశామని, ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కులు పెట్టుకోవాల్సిందేనని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. మొదటి మూడుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి రూ.200, తర్వాత రూ.500 ఫైన్ విధిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1,145 వెహికల్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెహికల్స్ వాడొద్దని, దగ్గరలోని షాప్ కు నడుచుకుంటూ వెళ్లాలని సూచించారు. “ఈ నెల 9 నుంచి మాస్కులు తప్పనిసరి చేశాం.రెండ్రోజులపాటు ప్రజలకు అవగాహన కల్పించాం. మాస్కులు కూడా ఫ్రీగా పంపిణీ చేశాం. రూల్స్ పాటించనివారిపై ఫైన్ విధిస్తు్న్నాం” అని భువనేశ్వర్ – కటక్ జంటనగరాల పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి అన్నారు. మాస్కులు లేకుంటే బంకుల్లో పెట్రోల్ పోయట్లేదని ఉత్కల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంజయ్ చెప్పారు.