ఒడిశా రైలు ప్రమాదం... సిగ్నల్ లోపంతోనే

ఒడిశా రైలు ప్రమాదం...  సిగ్నల్ లోపంతోనే
  • ఒడిశా రైలు ప్రమాదం సిగ్నల్ లోపంతోనే
  • గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు హాస్పిటల్​కు వచ్చిన యువత
  • ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన రైల్వే అధికారులు
  • సిగ్నల్ ఇచ్చి, తర్వాత తీసేసినట్లు రిపోర్టు
  • ఇప్పటిదాకా288 మంది మృతి..1,100 మందికి పైగా గాయాలు
  • తప్పు చేసినోళ్లను వదిలి పెట్టబోమన్న ప్రధాని
  • ఘటనా స్థలిని సందర్శించిన మోడీ.. గాయపడ్డ వారికి హస్పిటల్​లో పరామర్శ
  • సహాయక చర్యలు పూర్తి.. పునరుద్ధరణ పనులు మొదలు
  • ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన రైల్వే అధికారులు

బాలాసోర్/భువనేశ్వర్: ఒక్క పొరపాటు.. పెను ప్రమాదానికి దారి తీసింది. ఒక్క ‘సిగ్నల్’ మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఒడిశాలోని బాలాసోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ లోపమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కోరమండల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలు వెళ్లేందుకు ముందుగా సిగ్నల్ ఇచ్చి, తర్వాత తీసేసినట్లు వెల్లడైంది. ఇది మానవ తప్పిదమో? సిగ్నల్ వైఫల్యమో? కారణమేదైనా.. 288 ప్రాణాలు గాలిలో కలిశాయి. 1,100 మందికి పైగా గాయపడ్డారు. తెగిపడ్డ శరీరభాగాలు.. రక్తసిక్తమైన పరిసరాలు.. నుజ్జునుజ్జయిన బోగీలతో ప్రమాద స్థలి మొత్తం భీతావహంగా కనిపించింది. శనివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని ఆయన ప్రకటించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో మాట్లాడారు. ఈ విషాద ఘటనపై ప్రపంచ దేశాలు.. ఇండియాకు బాసటగా నిలిచాయి. కెనడా, రష్యా, జపాన్ తదితర దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. మరోవైపు శనివారం మధ్యాహ్నానికి సహాయక చర్యలు పూర్తి చేసిన అధికారులు.. రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.


లూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎట్లపోయింది?


రైల్వే అధికారులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలు బయటికి వచ్చాయి. ‘‘శాలిమార్ – చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలు (ట్రైన్ నంబర్ 12841).. ‘అప్ మెయిన్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మీదుగా వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. తర్వాత సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసేశారు. ఈ క్రమంలో కోరమండల్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలు పక్కనే ఉన్న ‘లూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లోకి వెళ్లింది. అప్పటికే అక్కడ నిలిచి ఉన్న గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైలును వేగంగా ఢీకొట్టింది. దీంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పి.. పక్క ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడ్డాయి. ఇదే సమయంలో ‘డౌన్ మెయిన్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మీదుగా వచ్చిన యశ్వంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ - హౌరా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలు ఆ బోగీలను ఢీకొట్టింది. దీంతో హౌర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి” అని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ రిపోర్టును రైల్వే బోర్డుకు అందజేశారు. అయితే సిగ్నల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు విరమించుకున్నారనే దానిపై అందులో క్లారిటీ ఇవ్వలేదు. ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎలా వెళ్లిందనే దానిపైనా స్పష్టత లేదు. సిగ్నలింగ్ ప్రక్రియలో మానవ తప్పిదం జరిగిందా? సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోపం తలెత్తిందా? ఇంకేదైనా సమస్యా? లేక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

128 కిలోమీటర్ల వేగంతో ఢీ

కోరమండల్, హౌరా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైళ్లు సాధారణంగానే 130 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ 128 కిలోమీటర్లు.. హౌరా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 116 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత పెరగడానికి, మృతుల సంఖ్య భారీగా ఉండటానికి ఇదే కారణమని భావిస్తున్నారు. వేగంతో ఢీకొట్టడంతో ఒకదానిపై ఇంకోటి పడేసినట్లుగా కొన్ని బోగీలు కుప్పగా పడ్డాయి. కొన్ని తునాతునకలయ్యాయి. ఇంకొన్ని తలకిందులయ్యాయి. ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరైన 21 బోగీలు పట్టాలు తప్పాయని, కొన్ని తలకిందులయ్యాయని రైల్వే బృందం గుర్తించింది. గార్డ్ బ్రేక్ వ్యాన్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 అప్ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. ఇంజిన్ మాత్రం గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైలు పైకెక్కింది. దేశ చరిత్రలో నాలుగో అతి పెద్ద రైలు ప్రమాదమని అధికారులు చెబుతున్నారు.

హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లు ఇవీ

బాధితుల గురించి సమాచారం తెలుసుకోవాలకునే వారి కోసం ఒడిశా ప్రభుత్వం 06782-262286 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. రైల్వే శాఖ కూడా హౌరా (033-26382217), ఖరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ (8972073925), బాలాసోర్ (8249591559), చెన్నై (044- 25330952) హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లను ఏర్పాటు చేసింది.

భారీ క్రేన్లు, బుల్డోజర్లతో  పునరుద్ధరణ చర్యలు

మట్టిలో కూరుకుపోయిన ఓ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెలికి తీసేందుకు శనివారం భారీ క్రేన్లు, బుల్డోజర్లను ఉపయోగించారు. ‘‘ఓ బోగీపై మరో బోగీ ఎక్కింది. దీంతో కిందున్న కోచ్.. భూమిలోకి దిగిపోయింది. దాన్ని పైకి తీసిన తర్వాత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని అధికారులు చెప్పారు. ‘‘ఇక ఒక్క బోగీ మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తిగా దెబ్బతింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్, ఓడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్, ఫైర్ సర్వీస్ సిబ్బంది కలిసి శ్రమిస్తున్నారు. బోగీని కట్ చేసి, ఎవరైనా ఉన్నారేమోనని గాలిస్తున్నారు” అని ఒడిశా సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీకే  జేనా తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉదయాన్నే చేరుకున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలికి చేరుకుని.. వివరాలను తెలుసుకున్నారు. 1,100 మంది గాయపడగా.. వీరిలో 100 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. నాలుగు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

పరిహారం ప్రకటించిన  కేంద్రం, రైల్వే, పశ్చిమ బెంగాల్

మృతులకు రైల్వే రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, గాయాలైన వారికి రూ.50 వేల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా ఇస్తామని చెప్పింది. ప్రధాని కూడా  పీఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద అదనపు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియాగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ప్రకటించారు. మరోవైపు మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రానికి చెందిన బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని తెలిపారు.