ఒడిశా రైలు ప్రమాదం... గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేత

ఒడిశా రైలు ప్రమాదం... గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేత

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా మరణించారు. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వే అధికారులు ఎక్స్ గ్రేషియా అందజేశారు. బాలాసోర్ జిల్లా సోరో పట్టణంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి  రైల్వే అధికారులు రూ.50,000 ఎక్స్ గ్రేషియా పంపిణీ చేశారు. 

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు  ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ బాధితులకు జూన్03వ తేదీ శుక్రవారం  ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒడిశాలో రైలు ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి PMNRF  నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని ప్రధాని కార్యాలయం తెలిపింది.

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ  వైష్ణవ్ ట్విట్టర్‌లో ప్రకటించారు.