ఒడిశా రైలు ప్రమాదం.. 48 రైళ్లు రద్దు , 39 దారి మళ్లింపు

ఒడిశా రైలు ప్రమాదం.. 48 రైళ్లు రద్దు , 39 దారి మళ్లింపు

ఒడిశా రైలు ప్రమాద ఘటనతో ఇప్పటికి 48 రైళ్లు రద్దు చేయబడ్డాయి, 39 దారి మళ్లించబడ్డాయని రైల్వే  అధికారులు వెల్లడించారు.  మరో ఏడు రైళ్లను  టాటానగర్ స్టేషన్ మీదుగా దారి మళ్లించినట్లు  తెలిపారు. 12837 హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12863 హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12839 హౌరా-చెన్నై మెయిల్ రద్దు చేసినట్లు అధికారి తెలిపారు.

 

12895 హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 20831 హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, 02837 సంత్రాగచ్చి-పూరీ ఎక్స్‌ప్రెస్‌లను కూడా   రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ , గూడ్స్ రైలు ప్రమాదానికి గురై233 మంది మరణించగా 900 మందికి పైగా  గాయపడ్డారని అధికారులు తెలిపారు.

 రద్దు చేసిన రైళ్లు

-12837 హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 
-12863 హౌరా-SMVB సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

-12839 హౌరా-చెన్నై మెయిల్ ప్రయాణం, జూ

-12895 షాలిమార్-పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

-20831 షాలిమార్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్

-02837 సంత్రాగచ్చి-పూరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్

- 22201 సీల్దా-పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్