ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 278కి చేరింది. దాదాపు 1000 మంది గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మూడు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంపై బాలీవుడ్, టాలీవుడ్ నటులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఒడిశా రైలు ప్రమాదం చాలా బాధాకరమని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ దురదృష్టకర ప్రమాదం నుండి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఒడిశా, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఒడిశా రైలు ప్రమాద మృతులకు జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. “ రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతి. ఈ విధ్వంసకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి..అని ట్విట్టర్ లో తెలిపాడు. ః
మనోజ్ బాజ్‌పేయి కూడా ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది 'చాలా భయంకరమైనది! సో ట్రాజిక్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై వివేక్ రంజన్ అగ్నిహోత్రి విచారం వ్యక్తం చేశారు. ఇది “విషాదకరమైనది, బాధాకరమైన సంఘటన అని... ఈ రైలు ప్రమాదానికి జవాబుదారీ ఎవరు? అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాధించాలని ప్రార్థనలు చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
ఒడిశా రైలు ప్రమాదంపై నటి, రాజకీయ నాయకురాలు కిరణ్ ఖేర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. మృతుల కుటుంబాల బాధను తలచుకుంటే బాధేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అంటూ ట్విట్టర్ లో పేర్కొంది.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నటుడు సోనూసూద్ విచారం వ్యక్తం చేశారు. ముక్కలైన హృదయం ఎమోజీని ట్వి్ట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం యొక్క చిత్రాన్ని ట్వీట్ చేస్తూ మృతులకు సంతాపం ప్రకటించారు.