అనుప్రియ లక్రా... గిరిజన బిడ్డ.... అయితేనేం ఆకాశానికి ఎగిరింది. కనీస వసతులు లేని చోటు నుంచి పైలట్ స్థాయికి ఎదిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఒడిశా నుంచి ఈమె 'తొలి మహిళా పైలట్'గా పేరు తెచ్చుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆకాశమంత లక్ష్యాన్ని అందుకుంది.
మల్కాన్ గిరి జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మల్కాన్ గిరి అనే పేరు వింటుంటాం. ఒడిశాలోని ఓ మారుమూల జిల్లా మల్కాన్ గిరి. మావోయిస్టు సమస్య ఎక్కువగా ఉన్న జిల్లా. రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా ఉండదు. కనీస వసతులు కూడా కరువు. అలాంటి మల్కాన్ గిరిలో పుట్టి, పెరిగిన అనుప్రియ పైలట్ స్థాయికి ఎదిగింది. ఇరవై ఏడేళ్ల అనుప్రియ చిన్నప్పట్నుంచి పైలట్ కావాలని ఆమె లక్ష్యం. తండ్రి మరినియాస్ లక్రా పోలీస్ కానిస్టేబుల్. తల్లి జిమాజ్ యాస్సిస్, వీరికి ముగ్గురు పిల్లలు. ఇంటికి పెద్ద బిడ్డ అనుప్రియ. మిషనరీ స్కూల్ లో చదువుకుంది. చిన్నప్పట్నుంచీ కష్టపడేతత్వం. ఎప్పటి పాఠాలను అప్పుడే చదివేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును మాత్రం విడిచి పెట్టలేదు. తల్లిదండ్రులు కూడా అనుప్రియను ప్రోత్సహించారు.
Also Read :- ఇది మొబైల్ ఫోనా.. పుస్తకమా
పైలట్ లక్ష్యంగా..
ఇంటర్ తర్వాత మల్కాన్ గిరి నుంచి భువనేశ్వర్ కి షిఫ్ట్ అయ్యింది అనుప్రియ. ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యింది. ఇంజనీరింగ్ చేస్తున్నా కూడా పైలట్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజనీరింగ్ ను మధ్యలోనే వదిలేసి పైలట్ పరీక్ష రాసింది. మంచి మార్కులు సాధించడంతో భువనేశ్వరిలో పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్'లో చేరింది. ఎనిమిదేళ్లు కష్టపడింది. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో కోపైలట్ ఉద్యోగం సాధించింది.. కమర్షియల్ పైలట్ అయ్యింది. పిల్లలను ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు అని చెప్ప దానికి అనుప్రియే ఒక ఉదాహరణ అంటారు. చాలామంది.
ఆర్ధిక ఇబ్బందులు..
పైలట్ కావడం అంత ఈజీ కాదు. మధ్య తరగతి కుటుంబం. ఎన్నో ఖర్చులు భరించాలి. అయినా బిడ్డ లక్ష్యం కోసం తల్లిదండ్రులు కష్టపడ్డారు. ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా.. ఆ ప్రభావం అనుప్రియ మీద పడనివ్వలేదు. లోన్లు తీసుకొని మరీ చదివించారు. ఆడపిల్లే అయినా పూర్తి స్వేచ్ఛని చ్చారు. అనుప్రియ సక్సెస్ గురించి ఒడిశా ము ఖ్యమంత్రి సోషల్ మీడియాలో అభినందించారు. 'ఆమె విజయం మిగతా ఆడపిల్లలకు ఆదర్శం కావాలన్నారు.
Also Read :- ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..
ఎన్నో ఏళ్ల కష్ట పడింది
'అనుప్రియ చిన్నప్పట్నుంచే పైలట్ కావా లనుకుంది. పైలట్ శిక్షణ కోసమే ఏడేళ్లు కష్టపడింది. ఏ పనిచేసినా సాధించేదాకా విడిచిపెట్టదు. అనుప్రియ తల్లి కూడా ఎంతో ప్రోత్సహించింది. నా కూతురు అను కున్నది సాధించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు అనుప్రియ తండ్రి.. .