ఒడిశా: ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. జార్సుగూడ జిల్లా బెల్ పహార్ సమీపంలోని జాతీయ రహదారి-49పై వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి పోలీసు వ్యానును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందగా మరో 17 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వ్యానులో మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Odisha: Two policemen killed and 17 others injured when an overspeeding truck rammed into a police van near Belpahar on NH-49 of Jharsuguda district earlier this morning. pic.twitter.com/iG5PO4RsU9
— ANI (@ANI) March 1, 2019