దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా యూజీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఒడిశా విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. అయితే పరీక్షల రద్దు నుంచి మెడికల్, పారామెడికల్ మరియు ఫార్మసీ కోర్సులను మినహాయిస్తున్నట్లు తెలిపాయి. విద్యార్థుల ప్రతిభ మరియు గత పరీక్షలో వారు సాధించిన మార్కుల ఆధారంగా రద్దయిన పరీక్షల ఫలితాలు ఆగష్టు 2020లో వెల్లడిస్తామని యూనివర్సిటీలు తెలిపాయి.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ఉన్నత విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. యూజీ మరియు పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు థియరీ మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రెండూ రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. గతంలో జూన్ మరియు ఆగస్టు నెలల మధ్య ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతండటంతో తాజాగా పరీక్షల రద్దు నిర్ణయం తీసుకుంది.
అయితే యూనివర్సిటీలు ప్రకటించిన మార్కులతో విద్యార్థులు సంతృప్తిపడకపోతే.. ఇంప్రూవ్ మెంట్ కు వెళ్లోచ్చని విద్యాశాఖ తెలిపింది. ఇంప్రూవ్ మెంట్ పరీక్షలను నవంబర్ లో నిర్వహించి.. డిసెంబర్ లో ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది.
అదేవిధంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు రెండు బ్యాక్ లాగ్ పేపర్లుంటే.. వాటిని కూడా రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు మాత్రం రెగ్యూలర్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు రాయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా.. యూజీ మరియు పీజీ విద్యార్థులు తమ పరిశోధన మరియు ప్రాజెక్టులను పోస్ట్, ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. కానీ, వైవా టెస్ట్ మాత్రం జరగదని తెలిపింది. ఇక ఫస్టియర్ విద్యార్థులు మాత్రం రెండో సెమిస్టర్ ప్రమోట్ అవుతారని.. బ్యాక్ లాగ్ మాత్రం రాయాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
For More News..