ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదన ఆరోపణలపై రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌పై ఒడిశా విజిలెన్స్ దాడుల్లో రూ. 3 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ జూన్ 23న తెలిపింది. భువనేశ్వర్, నౌరంగ్‌పూర్, భద్రక్ తదితర ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది చోట్ల.. నవరంగపూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంతకుమార్ రౌత్‌పై తొమ్మిది బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ దాడుల్లో భువనేశ్వర్‌లో దాదాపు రూ.2.25 కోట్ల విలువైన నగదు, నబరంగ్‌పూర్‌లో రూ.77 లక్షలు లభించినట్టు తెలుస్తోంది.
విజిలెన్స్ విభాగం ఏం చెప్పిందంటే..
"ఈరోజు నవరంగపూర్ సబ్ కలెక్టర్ ప్రశాంత కుమార్ రౌత్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణపై, ఒడిశా విజిలెన్స్ భువనేశ్వర్, నౌరంగ్‌పూర్, భద్రక్ తదితర ప్రాంతాల్లోని 9 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఒడిశా విజిలెన్స్‌లోని 9 బృందాల్లో 22 మంది ఉన్నారు. అదనపు ఎస్పీ, 7 డీఎస్‌పీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సోదాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి’’ అని ఒడిశా విజిలెన్స్ ట్వీట్ చేసింది. విజిలెన్స్ విభాగం పంచుకున్న విజువల్స్ ప్రకారం, రూ. 5వందల నగదు కట్టలు, కొన్ని ఆభరణాలతో పాటు టేబుల్‌పై కుప్పలుగా కనిపించాయి.
ALSOREAD:కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఆ నలుగురు..!
https://twitter.com/OdishaVigilance/status/1672132737141202945